
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా రీతూ వర్మ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాకు బాక్సాఫీస్ బిజినెస్ గురించి అవగాహన లేదని రీతూ వర్మ పేర్కొన్నారు. నటించే ప్రతి సినిమా సక్సెస్ సాధించాలని మనం కోరుకుంటామని ఆమె చెప్పుకొచ్చారు. నిర్మాతకు మంచి లాభాలు రావాలని ఆశిస్తామని ఆమె వెల్లడించారు. అలా జరగనప్పుడు తప్పకుండా బాధ పడతామని రీతూ వర్మ అన్నారు.
కెరీర్ తొలినాళ్లలో ఈ విషయంలో నేను ఎంతగానో బాధ పడ్డానని ఆమె తెలిపారు. కానీ ఇప్పుడు దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఏదైనా మూవీ ఫ్లాప్ అయితే దాని గురించి ఆలోచించకుండా భవిష్యత్తు సినిమాలపై దృష్టి పెడుతున్నానని రీతూ వర్మ వెల్లడించారు. నా ఫోకస్ మొత్తం యాక్టింగ్ పై ఉందని రీతూ వర్మ కామెంట్లు చేశారు.
నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలనేది నా ఉద్దేశం అని రీతూ వర్మ వెల్లడించారు. సినిమా అనేది 24 క్రాఫ్ట్స్ కు సంబంధించింది అని సినిమా ఫ్లాపైతే ఏ ఒక్క వ్యక్తినో నిందించడం కరెక్ట్ కాదని రీతూ వర్మ అన్నారు. గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ ట్యాగ్స్ తో హీరో హీరోయిన్లను వేధిస్తూ ఉంటారని ఆమె కామెంట్లు చేశారు. సినిమా హిట్టైనా అది అందరికీ సంబంధించిన విషయమని హీరోయిన్ రీతూ వర్మ పేర్కొన్నారు.