సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లో ఎవరైనా హీరోగా సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉంటేనే ఇలా చేస్తూ ఉంటారు . ఇండస్ట్రీలో ఎవరైనా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఇంట్లో ఉంటే పెద్ద వ్యక్తులు వస్తూ ఉండడం .. వాళ్లతో మాట్లాడుతూ ఉండడం.. మీడియా అటెన్షన్ గ్రాబ్ చేస్తూ ఉండడం ఇలాంటివి చేస్తూ ఉంటారు.  ఆ విధంగానే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఎవరైనా హీరో అవ్వాలి అని కోరుకుంటుంటారు.  కానీ నందమూరి బాలయ్య మాత్రం టూ డిఫరెంట్ తన నాన్నగారు అంత పెద్ద స్టార్ అయినా .. ఇంటికి పెద్ద పెద్ద స్టార్స్ వచ్చిపోతూ ఉన్నా..సరే బాలయ్యకి సినిమాలపై అస్సలు ఇంట్రెస్ట్ ఉండేదే కాదట .

బాలయ్య ఎక్కువ కూడా ఎప్పుడు ఇతరులకు హెల్ప్ చేయాలి అనే విధంగానే ఆలోచిస్తూ ఉండేవాడట . చిన్న ఏజ్ లోనే తన దగ్గర డబ్బులు ఉన్నదానితోనే నలుగురికి సహాయం చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు బాలయ్య . ఆ సమయంలో ఎన్టీఆర్ కూడా బాలయ్యను బాగా ప్రశంసించేశాడు.  చిన్న ఏజ్ లోనే అంతటి దయగల హృదయం ఉన్న బాలయ్య ఎక్కువగా ప్రజా సేవ చేయడానికి ఇంట్రెస్ట్ చూపేవారు . అంతేకాదు బాలయ్య పాలిటిక్స్ లోకి వచ్చిన రాకపోయినా తన ప్రజాసేవ మాత్రం కంటిన్యూ చేస్తూనే వచ్చాడు. మరీ ముఖ్యంగా బాలయ్య సినిమా ఇండస్ట్రీలో హీరో కాకపోయి ఉంటే మాత్రం బాలయ్య న్యాయపరమైన వృత్తిలో సెటిల్ అవ్వాలి అని బాగా ఆశపడ్డారట .

ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో వాళ్ళకి  న్యాయం చేసే విధంగా బాలయ్య ఎప్పుడు కూడా ఒక విషయాన్ని జెన్యూన్ గా ఆలోచించి వాదిస్తూ ఉంటారట.  ఆ సమయంలోనే చిన్నప్పుడు చాలామంది "నువ్వు లాయర్ అవ్వురా లాయర్  అవ్వు" అంటూ ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల బాలయ్య కి లాయర్  వృత్తిపై చాలా చాలా ఇష్టం ఏర్పడిందట. కానీ సడన్గా ఎన్టీఆర్ గారు బాలయ్యను సినిమా రంగంలోకి ఇంట్రడ్యూస్ చేశారు . ఇక ఆ తర్వాత బాలయ్య సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా మారిపోయాడు . ఇప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ గానే బాలయ్య కొనసాగుతున్నాడు. ఒక్కవేళ బాలయ్య హీరో కాకపోయుంటే మాత్రం కచ్చితంగా లాయర్ అయ్యుండేవాడట..!


మరింత సమాచారం తెలుసుకోండి: