మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో ప్రస్తుతం మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయింది. ఈ సినిమాలో చిరు కి జోడిగా నయనతార హీరోయిన్గా కనిపించబోతుంది. ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ డెహ్రాడూన్ లో మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క డెహ్రాడూన్ షెడ్యూల్ 10 రోజుల పాటు జరగనున్నట్లు , అందులో ఈ మూవీలో హీరోయిన్గా కనిపించనున్న నయనతార కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ కేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... చిరంజీవి కొన్ని రోజుల క్రితం ఖైదీ నెంబర్ 150 అనే సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి రెండు పాత్రలలో నటించాడు. ఇకపోతే అనిల్ రావిపూడి *ఖైదీ నెంబర్ 150" సినిమా ఫార్ములాను కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి , అనిల్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో చిరంజీవి రెండు పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఒక పాత్రలో చిరంజీవి సైలెంట్ గా ఉండబోతున్నట్లు , మరొక పాత్రలో అద్భుతమైన మాస్ యాంగిల్ ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఖైదీ నెంబర్ 150 సినిమాలో కూడా చిరంజీవి ఒక పాత్రలో సైలెంట్ గా ఉంటాడు. మరొక పాత్రలో ఫుల్ మాస్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అదే ఫార్ములాను అనిల్ , మెగా 157 మూవీ విషయంలో కూడా ఫాలో కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: