టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ అతి త్వరలో ఒకే తేదీన విడుదలవుతున్న సినిమాల జాబితాలో అఖండ2, ఓజీ ఉన్నాయి. అఖండ2 మూవీ టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాలయ్య సినీ కెరీర్ లో ఈ సినిమాతో 200 కోట్ల రూపాయల హిట్ చేరుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరోవైపు పవన్ అభిమానులు ఓజీ కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
అఖండ2, ఓజీ సినిమాల కోసం ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ప్రస్తుతానికి అయితే అఖండ2 సినిమాకే ఎడ్జ్ ఉంది. హిట్ సినిమాకు సీక్వెల్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను తక్కువగా అంచనా వేయలేమనే సంగతి తెలిసిందే. అఖండ2 వర్సెస్ ఓజీ బాక్సాఫీస్ వద్ద నిజమైతే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదవుతాయి.
 
ఈ రెండు సినిమాలలో ఏదో ఒక సినిమా వారం రోజులు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని వినిపిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. మొదట అఖండ2 సినిమా డేట్ నే ప్రకటించిన నేపథ్యంలో ఓజీ సినిమా రిలీజ్ డేట్ మారుతుందేమో అనే చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో పెద్ద సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి ఒకింత గందరగోళం నెలకొందనే సంగతి తెలిసిందే.
 
పెద్ద హీరోల సినిమాలేవీ చెప్పిన తేదీకి రిలీజ్ కావడం లేదు. హరిహర వీరమల్లు మూవీ ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాయిదాల విషయంలో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ విషయంలో సైతం ఒకింత గందరగోళం కొనసాగుతోంది. పవన్ సినిమాలకు మాత్రమే ఇలాంటి పరిస్థితి ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు హిట్టైతే మాత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన ఫలితాలు నమోదవుతాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: