
నేడు ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన ఫ్యాన్స్ ఆయన వెల్ విషర్స్ అందరూ ఆయనకు విషెస్ అందిస్తున్నారు. ఇదే మూమెంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు కూడా ట్రెండ్ అవుతున్నాయ్. ఆయనకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అయినా ఆయన భార్య వసుంధర ఆయన బర్తడే నాడు చేసే కొన్ని పనులు ట్రెండ్ అవుతున్నాయి . ఒకటి కాదు రెండు కాదు బాలయ్యను పెళ్లి చేసుకున్న మొదలు ఇప్పటివరకు ఆమె బాలయ్య ప్రతి పుట్టినరోజు నాడు కూడా ఆ పని చేస్తూనే వస్తుందట. బాలయ్య అంటే అంత ఇష్టం వసుందరికి .
బాలయ్య పుట్టినరోజు నాడు కచ్చితంగా వసుంధర పదివేల మందికి అన్నదానం చేయిస్తుందట. అంతేకాదు గుడిలో ప్రత్యేక పూజలు కూడా చేయిస్తూ వస్తుందట . బాలయ్య ఆయురారోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండాలి అంటూ ప్రతి పుట్టినరోజుకు ఆమె స్వయంగా గుడికి వెళ్లి బాలయ్య పేరిట అభిషేకాలు పూజలు చేయిస్తుందట. ఆ తర్వాత పదివేల మందికి అన్నదానం చేసేలా ప్రతి సంవత్సరం కూడా అనాధ శరణాలయాలకు కొంత డబ్బు ఇస్తుందట . అంతేకాకుండా పేద పిల్లలకు బట్టలు పంపిణీ కూడా చేస్తుందట. సాధారణంగా తమ భర్త పుట్టినరోజు అయితే గ్రాండ్గా పార్టీ ఇస్తుంటారు భార్యలు . మహా అయితే గుడికి వెళ్ళి పూజ చేస్తారు . కానీ బాలయ్య భార్య వసుంధర మాత్రం మోర్ స్పెషల్ . ఆయన పేరు చెప్పుకొని నలుగురు బ్రతికేలా ఆయన పేరు చెప్పి ఆకలి తీరుస్తుంది జనాలకి . నిజంగా బాలయ్యకు వసుంధర దొరకడం చాలా చాలా లక్కీ అంటున్నారు అభిమానులు..!