
పుష్ప రాజ్ క్యారెక్టర్ లో నటించిన అల్లు అర్జున్ ఆ తర్వాత పుష్పరాజ్ లాగే చాలా సందర్భాలలో బిహేవ్ చేశాడు అని సినిమా ప్రమోషన్స్ టైం లో అల్లు అర్జున్ అరెస్ట్ లో చాలామంది మాట్లాడుకున్నారు. మరీ ముఖ్యంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన మూమెంట్ లో అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు అందరికీ పుష్ప రాజ్ ని రియల్ గా చూసినట్లే అనిపించింది అనేలా మాట్లాడుకున్నారు . మరి ముఖ్యంగా పోలీసులు ఆయన అరెస్టు చేసి తీసుకెళ్తున్నప్పుడు అల్లు అర్జున్ దండం పెడుతూ చేతులు ఊపుతున్న పద్ధతి .. అల్లు అర్జున్ కి పుష్ప రాజ్ పూనాడేమో అనే సందేహాలు కూడా కలగజేసింది .
కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ మరోసారి ట్రోల్ చేస్తున్నారు బన్నీ హేటర్స్. రీసెంట్ గానే అల్లు అర్జున్ ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసమే అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు అనేది టాక్ . అల్లుఅర్జున్ ని అక్కడ చాలా ఘనంగా రిసీవ్ చేసుకున్నారు జనాలు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ లోపల నుండి బయటికి వస్తున్న మూమెంట్లో చేతులు ఊపుతూ నడిచిన పద్ధతి అందరికీ పుష్ప రాజ్ ని గుర్తు చేసింది .
పుష్ప రాజ్ని మరోసారి చూస్తున్నాం అని కామెంట్స్ చేశారు జనాలు. కొందరు దీనిని పాజిటివ్ గా తీసుకుంటే మరి కొందరు మాత్రం బన్నీకి ఇంకా పుష్పరాజ్ గాడి పొగరు తగ్గలే ..ఆ నడక ఆ హెడ్ వైట్ అలానే ఉన్నాయి అంటూ కూసింత ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . బన్నీ అభిమానులు మాత్రం అలాంటి వాటిని తిప్పి కొడుతున్నారు. బన్నీ రేంజ్ అంటే అదే. అట్లీ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిపోతాడు కుళ్ళుకొని చావాల్సిందే మిగతా హీరోల ఫ్యాన్స్ అంటూ ఘాటు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ మరొకసారి సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడమే కాకుండా ట్రోలింగ్ కి కూడా గురవుతున్నాడు..!