
గ్రామస్తులు తిరగబడటంతో పాటు విధిలేని పరిస్థితుల్లో బాధిత ఫ్యామిలీకి డబ్బులిచ్చి మంత్రి చేతులు దులుపుకుని వెళ్లిందని రోజా ఒకింత ఘాటుగా ఆమె కామెంట్లు చేశారు. ఇకపై ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పడానికి బదులు కూటమి పాలనలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.
అనంతపురం దుర్ఘటనను చూస్తే ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తుందని రోజా తెలిపారు. ఇంటర్ చదువుతున్న గిరిజన విద్యార్థిని తన్మయ కనిపించడం లేదని పాప తల్లీదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్తే అవమానకరంగా ప్రవర్తించారని రోజా కామెంట్లు చేశారు. పోలీసులు ఫిర్యాదును పట్టించుకోకపోవడం వల్ల ఆరు రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమైందని తెలిపారు.
పరిటాల సునీత ఎమ్మెల్యేగా పని చేస్తున్న నియోజకవర్గంలో మైనర్ బాలికను రేప్ చేస్తుంటే సాక్షి మీడియా దాన్ని వెలుగులోకి తెచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో బాధిత కుటుంబం ఊరు వదిలి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆడపిల్లల మాన ప్రాణాలను తీయడం టీడీపీ వాళ్లకు సహజమైందని రోజా పేర్కొన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు