
సినిమా కోసం ఏమైనా చేస్తాడు . బరువు తగ్గమన్నా తగ్గుతాడు . పెరగమన్నా పెరుగుతాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా విషయంలో మాత్రం వెనకడుగు వేశాడు . డైరెక్టర్ చెప్పిన పని చేయను అంటూ ముఖానే చెప్పేశాడు . ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా..? "నాన్నకు ప్రేమతో". తారక్ కెరియర్లోనే వన్ ఆఫ్ ది సెంటిమెంట్ సినిమా. సుకుమార్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా ఫుల్ సెంటిమెంట్ బేస్డ్ ఆధారంగా తెరకెక్కింది . నాన్నను ఇష్టపడి నాన్నను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు .
ఎన్టీఆర్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంటాడు. అయితే నిజానికి ఈ సినిమా చివరి షాట్ లో జూనియర్ ఎన్టీఆర్ గుండు కొట్టుకొని కనిపించాలట. తన నాన్నగారు చనిపోయినప్పుడు శాస్త్రీయ బద్దంగా జరిపించాల్సిన కార్యక్రమాల కోసం నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ని గుండు కొట్టించుకోవాలి అంట సుకుమార్ అడగ్గా.. దానికి తారక్ నో చెప్పారట. ఆయన నెక్స్ట్ సినిమా షెడ్యూల్స్ కి అది ఇబ్బంది అవుతుంది అన్న కారణంగా సుకుమార్ ఎంత రిక్వెస్ట్ చేసినా జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోలేదట . ఇక సుకుమార్ ఆ సీన్స్ ని మారుస్తూ గుండు కొట్టించే సీన్స్ ని టోటల్ గా మార్చేశాడు . అప్పట్లో ఈ న్యూస్ చాలా వైరల్ అయింది . మరొకసారి ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ హాట్గా వైరల్ అవుతుంది..!