- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండున్నర దశాబ్దాల క్రితం నటించిన తమ్ముడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు ఈ తరంలోను అభిమానులు ఉన్నారు. ఆ హిట్ టైటిల్ ని వాడుకొని పవన్ అభిమాన హీరో అయినా కుర్ర హీరో నితిన్ మరోసారి తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నితిన్ - వేణు శ్రీరామ్ - దిల్ రాజు నిర్మాణం. మూడు ఏళ్లుగా నిర్మాణం లో ఉన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా వచ్చింది. వేణు శ్రీరామ్ అంటే సున్నితంగా ఫ్యామిలీ సినిమాలు అందిస్తారు అని అందరూ అనుకుంటారు. కానీ తమ్ముడు ట్రైలర్ చూస్తే మొత్తం విజువల్స్ మీద ఫోకస్ చేసింది. సినిమా లైన్‌ సింపుల్ గా ఉంది. ఓ భయంకరమైన విలన్ .. అతడి సామ్రాజ్యం ఆ విలన్‌కు ఎదురు వెళ్లిన అక్క ... ఆమె ఆశ‌యాన్ని నిలబెట్టడానికి బయలుదేరిన తమ్ముడు.


ఈ కథకు విలన్ ట్రాక్ ... దాని బ్యాక్ డ్రాప్ యాక్షన్ సీన్లు అన్ని భారీగా ఉన్నాయి. అయితే ట్రైలర్ చూస్తే కథ‌ ముందే తెలిసిపోయింది. రొటీన్ కథ‌ అన్న అనుమానం ట్రైలర్ కలిగించడంతో ఆసక్తి కాస్త తగ్గింది. ట్రైలర్లో హీరోయిన్ ట్రాక్‌ను పక్కన పెట్టారు. పూర్తిగా మాస్ ... యాక్షన్ సినిమాగా ట్రైలర్ ప్రజెంట్ చేసింది. అలాగే నితిన్ కూడా కొత్తగా చూపించలేదు. రొటీన్ హీరోయిజం తప్ప ఏమీ లేదు. లయ పాత్రతో పాటు మిగిలిన పాత్రలు అలా పరిచయం చేసి వదిలేసారు. విలన్ చేతిలో బందీగా ఉండే ఓ ప్రాంతం తదితర వ్యవహారాలు ఉన్నాయి. మొత్తం మీద సినిమా టైటిల్ క్లాస్ గా ఉన్నా... ట్రైలర్ మాత్రం ఊర మాస్గా ఉంది. మరి పవన్ తమ్ముడుతో హిట్టు కొడతాడా ? లేదా పవన్ హిట్ టైటిల్‌ను చెడగొడతాడా ? అన్నది జులై 4న తేలిపోనుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు



మరింత సమాచారం తెలుసుకోండి: