కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో తలపతి విజయ్ ఒకరు. ఈయన ఆఖరుగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే తలపతి విజయ్ కొంత కాలం క్రితం ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ఈయన తన కెరీర్లో కేవలం ఒకే ఒక సినిమాలో నటిస్తాను అని , ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెడతాను అని ప్రకటించాడు. ఆ తర్వాత తలపతి విజయ్ "జన నాయగన్" అనే సినిమాలో హీరో గా నటించనున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇకపోతే ఈ మూవీ బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాకు రీమేక్ గా రూపొందుతున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి.

కానీ ఈ సినిమా భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా రూపొందుతుందా ..? లేక కొత్త కథతో తెరకెక్కుతుందా అనే దానిపై మాత్రం ఇప్పటివరకు పెద్దగా స్పష్టత లేదు. ఇకపోతే ప్రస్తుత ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీ కి సంబంధించిన గ్లీమ్స్ వీడియోను తలపతి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 22 వ తేదీన విడుదల చేయాలి అని ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లో ఈ మూవీ బృంద వారు విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా జన నాయగన్ మూవీ గ్లీమ్స్ వీడియోను తలపతి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు డిసైడ్ అయినట్లు వార్తలు రావడంతో విజయ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: