
తాను ఇలాంటి చిత్రాలు నిర్మించడానికి తనకి స్ఫూర్తినిచ్చిన చిత్రం జాతి రత్నాలు.. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎన్నో సందర్భాలలో తాను తెలియజేశానని ఈ సినిమా కోసం యాంగర్స్ ని ప్రోత్సహించామని తెలిపారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా పనిచేశారు.. సత్య, వెన్నెల కిషోర్ ట్రాక్ చాలా బాగా కుదిరిందని ప్రేక్షకులు ఖచ్చితంగా కడుపుబ్బ నవ్వుకుంటారు త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా తాము ప్రకటిస్తామంటూ తెలిపారు. అలాగే డైరెక్టర్ అనుదీప్, అల్లు అరవింద్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.
అలాగే అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ తన జీవితంలో తల్లిదండ్రుల కంటే తాను ఎక్కువ సమయాన్ని అల్లు అరవింద్ దగ్గరే గడిపాను మా ఇంట్లో కంటే ఎక్కువగా ఆయన ఇంట్లోనే ఉన్నానని.. ఆయన్ని చూస్తే మాకు ఒక గాడ్ ఫాదర్ లా అనిపిస్తుంది మాకు ఎంతో సపోర్టివ్ గా నిలిచారు ఆయన ఇచ్చిన క్రమశిక్షణ వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామంటూ బన్నీ వాసు తెలిపారు. ఇక తన జీవితంలో ఎలాంటి లవ్ స్టోరీలు కూడా లేవని ఒకవేళ అలాంటివన్నీ మిస్ అయింది అంటే అది 100కు 100% అల్లు అరవింద్ బన్నీ వల్లే అంటూ నవ్వుతూ తెలియజేశారు బన్నీ వాసు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.