టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోగా నటించి ఎన్నో విజయాలను అందుకొని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. పవన్ స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. రాజకీయాలలో ఎన్నో ఎత్తు పల్లాలను ఎదుర్కొన్న పవన్ కొంత కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం పవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నాడు.

ఇక పవన్ కళ్యాణ్ ఓ వైపు ఉప ముఖ్యమంత్రి గా ఎంతో బిజీగా ఉన్నా కూడా తాను ఉప ముఖ్యమంత్రి కాకముందు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడానికి ప్రస్తుతం ఎంతో కష్టపడుతున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు అనే సినిమాను స్టార్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్టార్ట్ అయింది. కానీ క్రిష్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. దానితో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా భారీ గ్రాఫిక్స్ తో రూపొందినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో మొత్తం 6 వేలకు పైగా VFX షార్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటివరకు ఈ సినిమా ప్రచార చిత్రాలు నార్మల్ గానే ఉన్నాయి. కానీ ఈ సినిమాలో 6 వేలకు పైగా VFX షాట్స్ వాడారు అని వార్త బయటకు రావడంతో ఈ సినిమా ట్రైలర్ విడుదల అవుతే ఈ సినిమాలో నిజంగా గ్రాఫిక్స్ పార్ట్ అంతా ఉందా అనేది క్లియర్ గా తెలుస్తుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా పవన్ అభిమానులు మాత్రం ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: