
అయితే ఇక్కడ దీపికా మాత్రం అలాంటి కన్ఫ్యూజన్ లేదు .. ఏం మరో అనుమానం లేకుండా అల్లు అర్జున్ సినిమాని ఓకే చేసుకున్నారు .. అట్లీ , అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సినిమాలో దీపిక హీరోయిన్గా నటిస్తున్నారు .. ఈ సినిమాలో దీపికాకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోని కూడా రిలీజ్ చేశారు మేకర్స్ . ఇక ఈ మూవీలో సూపర్ ఉమెన్ గా నటించబోతున్నారు దీపిక .. అంతేగాకుండా ఇందులో ఆమె యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా ఉండబోతున్నాయని ఆ వీడియో చెప్పకనే చెప్పేస్తుంది ..
స్పిరిట్ కంటే ఇందులోనే తనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని ఉద్దేశంతో ఆట్లీ సినిమాకు దీపిక ఓకే చెప్పినట్టు క్లారిటీ వస్తుంది .. అలాగే అల్లు అర్జున్ సినిమాకు ఊహించని దానికంటే భారీగా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అట్లీ . సైన్స్ ఫిక్షన్ కాదు దానికి మించి ఉంటుందని అనౌన్స్మెంట్ వీడియో తోనే క్లారిటీ ఇచ్చారు. ఇక ఇందులో దీపిక తో పాటు మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది .. వీళ్ళ వీడియోలు కూడా త్వరలోనే బయటకు రానున్నాయి .. 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు అట్లీ ..