ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు కలిగిన నటీమణులలో దీపికా పదుకొనే ఒకరు. ఇకపోతే గత కొంత కాలంగా దీపికా పదుకొనే మొదట ఓ సినిమాను ఓకే చేసినట్లు , ఆ తర్వాత తన పరిస్థితుల కారణంగా ఆ సినిమా కోసం కేవలం ఎనిమిది గంటలకు మాత్రమే పని చేస్తాను అని , ఆ తర్వాత సినిమా కోసం సమయం కేటాయించేను అని , అలాగే తనకు పారితోషకంగా 25 కోట్లు కచ్చితంగా కావాలి అని డిమాండ్ చేసినట్లు , ఇక దీపిక డిమాండ్లకు ఒప్పుకోలేక ఓ దర్శకుడు ఆమెను సినిమా నుండి తీసేశాడు అని వార్తలు వస్తున్నాయి. దీనిపై అనేక మంది అనేక రకాలుగా స్పందిస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా బాలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి కబీర్ ఖాన్ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా కబీర్ ఖాన్ మాట్లాడుతూ ... నేను సినిమా ఇండస్ట్రీ లో 500 మందితో కలిసి పని చేస్తున్నాను. ఆ 500 మంది కి ఎవరి సొంత జీవితాలు వారికి ఉంటాయి. వారికి ఒక కుటుంబం ఉంటుంది. వారి వారికంటూ ఒక ప్రత్యేక జీవన శైలి ఉంటుంది. వర్కింగ్ అవర్స్ విషయంలో సినీ పరిశ్రమ వారికి సంబంధించి కొన్ని డిమాండ్లు ఉండడం మంచిదే. దీపిక కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తాను అని అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు ఒక కుటుంబం ఉంది. అందుకే ఆమె అలాంటి డిమాండ్లను పెట్టి ఉంటుంది. ఆమె డిమాండ్లను తప్పు పెట్టాల్సిన అవసరమే లేదు అని కబీర్ ఖాన్ స్పందించాడు.

అలాగే దీపిక 25 కోట్లు డిమాండ్ చేసింది అనే వార్తలపై కబీర్ ఖాన్ స్పందిస్తూ ... మంచి క్రేజ్ ఉన్న నటీమణులకు ఎంత పారితోషకం అయినా ఇవ్వచ్చు. వారికి క్రేజ్ ఉంది కాబట్టి వారు అంతగా అడుగుతున్నారు. లేనట్లయితే వారు అడగరు. వారికి ఉన్న క్రేజ్ ను బట్టి వారికి పారితోషకం ఇవ్వాల్సి ఉంటుంది అని కబీర్ ఖాన్ తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: