గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని అదిరిపోయే రేంజ్ ను క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చరణ్ తన తండ్రి అయినటువంటి చిరంజీవి హీరో గా రూపొందిన ఆచార్య సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంది. ఆ తర్వాత చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది.

సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న  పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తుండగా ... శివరాజ్ కుమార్ , జగపతి బాబు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ టీ టీ డీల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ఓ టి టి హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

సినిమా విడుదల అయ్యి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుంది అనే దాన్ని బట్టి ఈ మూవీ యొక్క ఓ టీ టీ ధర అనేది పెరగడం , తగ్గడం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ 110 కోట్ల బేస్ ప్రైస్ తో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ మూవీ కి కనుక భారీ కలెక్షన్లు వచ్చినట్లయితే ఈ మూవీ ఓ టి టి ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పెద్ది సినిమాకి ఓ టి టి హక్కుల ద్వారా పెద్ద ఎత్తున బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: