టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నట వారసులలో ఒకరు అయినటువంటి అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అఖిల్ , వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ అనే సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత కూడా ఈయన నటించిన చాలా సినిమాలు అఖిల్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చాయి. ఈయన ఇప్పటివరకు నటించిన సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ మాత్రమే కాస్త పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

ఆఖరుగా అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ కూడా భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ప్రస్తుతం అఖిల్ "లెనిన్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన గ్లీమ్స్ వీడియోను మేకర్స్ కొన్ని రోజుల క్రితమే విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే లెనిన్ మూవీ లో నాగార్జున కూడా ఓ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజ జీవితంలో అఖిల్ కు తండ్రి అయిన నాగార్జున "లెనిన్" మూవీ లో కూడా అఖిల్ కు తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర నిడివి కాస్త తక్కువ గానే ఉండనున్నట్లు తెలుస్తుంది.

కానీ ఈ సినిమా కథ మొత్తాన్ని మలుపు తిప్పే కీలకమైన పాత్రలో నాగార్జున కనిపించనున్నట్లు , ఆ పాత్ర అత్యంత పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నాగార్జున , అఖిల్ ఇద్దరు కనుక ఒకే సినిమాలో నటించినట్లయితే ఆ మూవీ పై అంచనాలు కూడా తార స్థాయికి చేరుతాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: