తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు డైరెక్షన్లో రాబోతున్న సంగతి తెలిసిందే.ఇందులో కీలకమైన పాత్రలో హీరో నాగార్జున కూడా నటించారు. అలాగే శృతిహాసన్ , ఉపేంద్ర, సత్యరాజ్,తదితర నటీనటులు కూడా నటిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా కూలి సినిమాలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది. కేవలం ఇందులో పది నిమిషాలు కనిపించబోతున్నారని అది కూడా చాలా పవర్ ఫుల్ పాత్ర అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


రజనీకాంత్ నటిస్తున్న మరొక చిత్రం జైలర్ 2. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ కుమార్ డైరెక్షన్లో వస్తూ ఉన్నది. గతంలో విడుదలైన జైలర్ సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పైన భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా అనిరుద్  సంగీతం బిజిఎం కూడా ఈ సినిమాకి బాగా ఉపయోగపడుతోంది. అలాగే నందమూరి బాలకృష్ణ కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి కానీ.. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.


అయితే ఇందులో మరొక బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఆ హీరో ఎవరో కాదు షారుక్ ఖాన్.. రజనీకాంత్ చిత్రంలో షారుక్ ఖాన్ కనిపించబోతున్నారనే విషయం అభిమానులకు తెలియగానే మొదట అభిమానులు ఆశ్చర్యపోయిన ఆ తర్వాత ఖుషీ అవుతున్నారు.. ఈ సినిమాతో కచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్ మార్కుని అందుకుంటుందని ధీమాని వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.మరి ఈ విషయంపై అటు డైరెక్టర్ నెల్సన్ కుమార్ హీరో రజనీకాంత్ ఏ విధంగా క్లారిటీ ఇస్తారు చూడాలి మరి. సన్ పిక్చర్ బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: