టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్గా పేరుపొందిన లయ అప్పట్లో ఎంతో మంది హీరోలతో నటించి తెలుగు అమ్మాయిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక హీరోయిన్గా నెమ్మదిగా అవకాశాలు తగ్గుతూ ఉండడంతో విదేశాలకు వివాహం చేసుకొని సెటిలై అక్కడే ఉద్యోగం కూడా చేస్తూ ఉండేది. అయితే ఇప్పుడు మళ్లీ చాలాకాలం తర్వాత రీఎంట్రీ ఇస్తోంది లయ. హీరో నితిన్ నటిస్తున్న తమ్ముడు చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. వచ్చేనెల 4వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.


తమ్ముడు చిత్రాన్ని దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం కూడా పాల్గొనింది తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించగా ఇందులో హీరోయిన్ లయకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురయ్యింది.. ముఖ్యంగా చెన్నకేశవరెడ్డి చిత్రంలో బాలకృష్ణకు చెల్లెలి పాత్రలో వివి. వినాయక్ గారు అడిగితే మీరు ఏడ్చేసారని అప్పట్లో ప్రచారం జరిగింది ?ఇందులో నిజమేంత అంటూ యాంకర్ ప్రశ్నించింది. ఈ విషయం పైన లయ ఇన్ని రోజుల తర్వాత క్లారిటీ ఇవ్వడం జరిగింది.


లయ మాట్లాడుతూ.. ఏమో ఈ విషయం నాకు సరిగ్గా గుర్తులేదు.. ఒకవేళ ఆ సినిమా వచ్చి చాలా ఏళ్ళు అవుతొందేమో.. ఒకవేళ ఏడిస్తే ఏడ్చానేమో బాలకృష్ణ గారితో అప్పట్లో తనకు సినిమాలో నటించాలనే ఆశగా ఉండేది అంటూ తెలియజేసింది లయ.. మొత్తానికి లయ చేసిన కామెంట్స్ వైరల్ గా చేస్తున్నారు ఫ్యాన్స్..మరి రీఎంట్రీ తోనైనా లయ మళ్లీ సక్సెస్ అందుకని సినిమాలను బిజీ కావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. హీరో నితిన్ కూడా సరైన సక్సెస్ అందుకోక చాలా కాలం అవుతోంది. కచ్చితంగా తమ్ముడు సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటారని అభిమానులు కూడా ధీమాతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: