టాలీవుడ్ ఇండస్ట్రీ లో డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాత గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు నిర్మించిన సినిమాలు అయినటువంటి గేమ్ చేంజర్ , సంక్రాంతికి వస్తున్నాం రెండు కూడా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యాయి. ఈ సినిమాలలో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కాగా , విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇక ఓకే సీజన్లో రెండు సినిమాలు విడుదల కావడం గురించి దిల్ రాజు మాట్లాడుతూ ... మా బ్యానర్లో రూపొందిన గేమ్ చేంజర్ , సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలు కూడా ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల అయ్యాయి. ఇక గేమ్ చేంజర్ సినిమాతో పాటు నేను నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిరంజీవి , చరణ్ కు నేను చెప్పాను. దానితో వారు అద్భుతంగా నన్ను సపోర్ట్ చేశారు. సంక్రాంతి నాటి సమయంలో మూడు సినిమాలు అద్భుతంగా ఆడతాయి.

మీరు ఆ సినిమాను కూడా విడుదల చేయండి అని చెప్పారు. వారు గనుక అలా చెప్పకుండా గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాము సినిమాను ఎలా విడుదల చేస్తారు ..? మీ బ్యానర్లో రూపొందిన రెండు సినిమాలను ఒకే సారి విడుదల చేస్తే ప్రాబ్లం అవుతుంది అని వారు కానీ అని ఉంటే రెండు సినిమాలు వచ్చేవి కావు. నాకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అంత పెద్ద ఎత్తున లాభాలు వచ్చేవి కాదు. చిరు , చరణ్ ఇద్దరి సపోర్టు తోనే నేను రెండు సినిమాలను ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయగలను. అలాగే మంచి లాభాలను పొందగలిగాను అని దిల్ రాజు తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: