సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఉన్న వారికి వరుస పెట్టి క్రేజీ అవకాశాలు దక్కుతూ ఉంటా యి. అదే ప్లాప్స్ వచ్చినట్లయి తే వారికి సినిమాల్లో అవకాశాలు కాస్త తగ్గు ముఖం పడుతూ ఉంటాయి . ఇది దాదాపు సహజంగా జరిగే విషయం. కానీ ఓ బ్యూటీ హీరోయి న్గా నటించిన మూడు సినిమాలలో రెండు సినిమాలతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి . కేవలం ఒకే ఒక సినిమాతో ఫ్లాప్ అయ్యింది. కానీ ఆమెకు ప్రస్తుతం పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కడం లేదు . ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు కావ్య కళ్యాణ్ రామ్. ఈమె చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి చిన్న తనం లోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. అందులో భాగంగా ఈమె మసూద సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ ప్రియదర్శి హీరోగా వేణు దర్శకత్వంలో రూపొందిన బలగం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఒక్క సారిగా ఈ మూవీ తో ఈమె క్రేజ్ భారీగా పెరిగింది. ఈమె ఆఖరుగా ఉస్తాద్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మాత్రం బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈమెకు పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కడం లేదు. ఈమె తాను నటించిన సినిమాల్లో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈమెకు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kkr