
అసలు రామ్ చరణ్ చేతికి ఏమైంది .. అంత పెద్ద బ్యాండేజ్ ఎందుకు వేశారు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు .. ఇక పెద్ది సినిమా షూటింగ్లో రామ్ చరణ్ గాయపడ్డారని కొందరు చెబుతున్నారు . అయితే రామ్ చరణ్ గాయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు .. పైగా ఈ గాయం పెద్దదేమి కాదని కూడా పలు వార్తలు బయటికి వస్తున్నాయి . గేమ్ చేంజర్ ఇచ్చిన షాక్ తో కొంత నిరాశకు గురైన రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు .. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసి చెప్పిన టైం కు రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నాడు .. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ రామ్ చరణ్ కు జంటగా నటిస్తుంది . అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందుకు వంటి వారు కీలకపాత్రలో నటిస్తున్నారు .. అలాగే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పెద్దిపై అంచనాలు పెంచేసింది .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు