రామోజీ ఫిలిం సిటీ లో దెయ్యాలు ఉన్నాయని చాలామంది సినీ ప్రముఖులు చెప్పడంతో ప్రస్తుతం ఈ వార్త మీడియాలో వైరల్ గా మారింది.రోజు ఎన్నో షూటింగ్స్ జరిగే రామోజీ ఫిలిం సిటీ లో దెయ్యాలు ఉన్నాయంటే ఆ ఫిలిం సిటీ ఇమేజ్ పడిపోతుంది.. ఒకవేళ అందులోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు అదే అనుభవాన్ని ఫేస్ చేశారంటే రామోజీ ఫిలిం సిటీ మూతపడడం ఖాయం.మరి అక్కడికి వెళ్లిన కొంతమంది సినీ సెలబ్రెటీలకు ఇలాంటి అనుభూతి ఎందుకు కలిగింది.. నిజంగానే రామోజీ ఫిలిం సిటీ లో దెయ్యాలు ఉన్నాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు ఉన్నాయని బాలీవుడ్ నటి కాజోల్, రాశిఖన్నా,తాప్సి పన్ను,ఎం ఎం కీరవాణి, డైరెక్టర్ సుందర్ సి వంటి ఎంతోమంది ప్రముఖులు చెప్పుకున్నారు. అంతేకాదు గూగుల్ లో మోస్ట్ హంటెడ్ ప్లేస్ లు ఏవేవి అని సెర్చ్ చేస్తే అందులో రామోజీ ఫిలిం సిటీ పేరు కూడా రావడం గమనార్హం. అయితే రోజు వందలాది షూటింగ్ లు జరుపుకొనే రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు ఉన్నాయి అనేది నిజమేనా..ఈ ప్రముఖ నటీమణులకు ఎందుకు ఇలాంటి అనుభవం ఎదురయింది అని చాలామందిలో ఒక టెన్షన్ అయితే పట్టుకుంది. అయితే రామోజీ ఫిలిం సిటీ స్థల పురాణం ప్రకారం అక్కడ గతంలో యుద్ధం జరిగిందని అది యుద్ధ భూమి అని కొంతమంది అంటున్నారు.

 ఇక మరికొంత మందేమో రామోజీ ఫిలిం సిటీ ఉన్న ప్లేస్ లో నిజాం నవాబుల సమాదులు ఉన్నాయని అందుకే అక్కడికి వచ్చిన కొంత మందికి దెయ్యాలు కనిపిస్తాయని అక్కడ నిజంగానే దెయ్యాలు సంచరిస్తాయని కొంతమంది అంటూ ఉంటారు.అంతేకాకుండా రామోజీ ఫిలిం సిటీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి అనుభవాన్ని చాలా సార్లు ఫేస్ చేశామని చెబుతూ ఉంటారు. అయితే మూఢనమ్మకాలు నమ్మడం మంచిది కాకపోయినప్పటికీ సినీ ప్రముఖులు చెబితే నిజమే కావచ్చు అని అనుకుంటున్నారు చాలామంది. మరి రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు ఉన్నాయి అంటూ వస్తున్న వార్తలు నిజమేనా.. లేక కల్పితమా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: