
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా పై ఇప్పటి వరకు ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి వస్తోంది. ఎట్టకేలకు ఊరించి ఊరించి ఊరించి ఐదేళ్ల కు ఈ నెల 24న థియేటర్ల లోకి వస్తోంది. ఈ సినిమా రెండు పార్టులుగా థియేటర్ల లోకి వస్తోంది. ఇది తొలి పార్ట్ ... క్రిష్ తో పాటు జ్యోతికృష్ణ ఏఎం దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఓజీ మీద పడింది. ఓజీ వస్తుందా ? అనుకున్న టైంకు రిలీజ్ చేస్తారా ? ఇలా కొత్త చర్చలు స్టార్ట్ అయ్యాయి. వీరమల్లు థియేటర్ల లోకి వచ్చిన రెండు నెలలకే పవన్ నుంచి మరో సినిమా వస్తుందా ? రాదా ? అన్న సందేహాలు నడుస్తున్నాయి.
అయితే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. రూమర్ల ను ఖండించేశారు. ఓజీ ఎట్టి పరిస్థితుల్లో నూ సెప్టెంబర్ 25న వచ్చేస్తుంది. దీనిపై మరోసారి మేకర్స్ స్పష్టత ఇచ్చేశారు. సెప్టెంబర్ 25న పవన్ ఓజీ గా థియేటర్ల లోకి దిగుతున్నా డు.. రాసి పెట్టుకోండి అంటూ చెప్పేశారు. ఏదేమైనా పవన్ నుంచి రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు అంటే ఫ్యాన్స్ కు మామూలు జోష్ కాదనే చెప్పాలి. సెప్టెంబర్ దాటితే మళ్లీ మంచి డేట్ కష్టమే.. దసరా, డిసెంబర్, సంక్రాంతి, సమ్మర్ ఇలా పెద్ద సినిమాలు రేసులో ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు