టాలీవుడ్ ఇండస్ట్రీ లో డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన అనేక సందర్భాలలో డిస్ట్రిబ్యూటర్ జీవితం ఎంతో కఠినంగా ఉంటుంది. అనేక సందర్భాలలో డిస్ట్రిబ్యూటర్ కు ఎన్నో కష్ట నష్టాలు ఎదురవుతాయి. మాకు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న సమయంలో ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదురయ్యాయి అని చెప్పుకొచ్చాడు. ఈయన దిల్ సినిమాతో నిర్మాతగా కెరియర్ను మొదలు పెట్టాడు. నిర్మాతగా కెరియర్ను మొదలు పెట్టిన మొదటి సినిమాతోనే సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయన ఒక్కో సినిమాని సెలెక్ట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా సినిమాలను నిర్మించుకుంటూ వెళ్ళాడు.

దానితో ఈయన నిర్మాతగా కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత చాలా సంవత్సరాల పాటు అపజయం అంటూ ఎరగకుండా కెరియర్ను ముందుకు సాగించాడు. దానితో దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుల్లో అంచనాలు కూడా తారా స్థాయికి చేరిపోయేవి. అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న దిల్ రాజు ఈ మధ్య కాలంలో ఆ స్థాయి విజయాలను వరుసగా అందుకోలేకపోతున్నాడు. ఈయన ఈ మధ్య కాలంలో నిర్మించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యాయి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజెర్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో గేమ్ చెంజర్  మూవీ భారీ డిజాస్టర్ ను అందుకుంది. ఈ మూవీతో దిల్ రాజుకు పెద్ద మొత్తంలో నష్టాలు కూడా వచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత కేవలం నాలుగు రోజులకే సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అయింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకొని దిల్ రాజుకు భారీ మొత్తంలో లాభాలను తీసుకువచ్చింది.

గేమ్ చేంజర్ ద్వారా వచ్చిన నష్టాల్లో చాలా శాతం సంక్రాంతికి వస్తున్నాం తో తీరినట్లు దిల్ రాజు నిర్మాణ భాగస్వామి శిరీష్ కూడా తాజాగా చెప్పుకొచ్చాడు. తాజాగా దిల్ రాజు , నితిన్ హీరోగా రూపొందిన తమ్ముడు సినిమాను నిర్మించాడు. ఈ మూవీ నిన్న విడుదల అయ్యి భారీ నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా ద్వారా కూడా పెద్ద ఎత్తున నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ మూవీ నష్టాల నుండి దిల్ రాజును ఏ సినిమా బయటపడేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: