సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాలు దక్కుతూ ఉన్న హీరోలు ఫుల్ జోష్లో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉంటారు. ఇక ఒక హీరోకి మంచి విజయాలు దక్కుతున్నాయి అంటే నిర్మాతలు కూడా ఆ హీరో మార్కెట్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి వారితో సినిమాలు చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక దర్శకులు కూడా అలాంటి హీరోలతో మూవీలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానితో మంచి విజయాలు వచ్చే హీరోలు వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ ఉంటారు. కానీ ఓ నటుడు తెలుగులో హీరోగా నటించిన మూడు సినిమాల్లో మూడు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి.

అయినా కూడా ఆయన అత్యంత స్లో గా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇంతకు ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు సూపర్ హిట్స్ తో కెరియర్ను అద్భుతమైన జోష్లో ముందుకు సాగిస్తున్న నవీన్ పోలిశెట్టి. ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో హీరోగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత ఈయన జాతి రత్నాలు అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత ఈయన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇలా మూడు విజయాలను వరుసగా అందుకున్న ఈయన నాలుగవ సినిమా విషయంలో చాలా స్లో గా ఉన్నాడు. చాలా కాలం క్రితం నవీన్ "అనగనగా ఒక రాజు" అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ షూటింగ్ చాలా స్లో గా జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇలా అద్భుతమైన విజయాలు ఉన్న నవీన్ చాలా స్లో గా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Np