పెళ్లి వయసు దాటిపోతున్న ఇంకా సింగిల్ గానే ఉన్న సౌత్ హీరోయిన్స్ లో అనుష్క శెట్టి ఒకరు. ప్రొఫెషనల్ లైఫ్ లో సూపర్ సక్సెస్ అయిన అనుష్క.. పర్సనల్ లైఫ్ లో మాత్రం వెనుకబడింది. గతంలో ప్రభాస్, అనుష్క రిలేషన్ లో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకోనున్నారని చాలా సార్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అభిమానులు కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఆశపడ్డారు. కానీ అటు ప్రభాస్, ఇటు అనుష్క ఇద్ద‌రూ ఈ వార్త‌ల‌ను కొట్టిపారేశారు. తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని స్ప‌ష్టం చేశారు.


అయితే గ‌త కొన్నాళ్ల నుంచి తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూస్తున్నా అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే టాక్ కూడా ఉంది. పోనీ ఎవరితోనైనా లవ్ లో ఉందా? అంటే అదీ లేదు. కానీ అనుష్కకు లవ్ ప్ర‌పోజ‌ల్స్‌ మాత్రం చాలానే వచ్చాయి. ముఖ్యంగా ఫస్ట్ లవ్ ప్రపోజల్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఆమె ఆరో తరగతిలో. అవును, మీరు విన్నది నిజమే. తనకు వచ్చిన ఫస్ట్ లవ్ ప్రపోజల్ గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో అనుష్క స్వయంగా రివీల్ చేసింది.


ఆరో తరగతి చదువుకుంటున్న రోజుల్లో మా క్లాస్మేట్ అయిన ఒక అబ్బాయి నా వద్దకు వచ్చి ఐ లవ్ యు అని చెప్పాడు. నువ్వంటే చచ్చేంత ఇష్టమని ప్రపోజ్ చేశాడు. కానీ అప్ప‌టికి ఐ లవ్ యు అంటే ఏంటో కూడా తెలియ‌ని నేనూ ఓకే అని చెప్పేశాను. నా లైఫ్ లో అదొక మెమొరీగా గుర్తుండిపోయిందంటూ అనుష్క చెప్పుకొచ్చింది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో క్రిష్ జాగర్లమూడి డైరెక్ష‌న్ లో `ఘాటి` అనే మూవీ చేస్తోంది. ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా జూలై 11న విడుద‌ల కావాల్సి ఉంది. కానీ అనివార్య కార‌ణాల‌తో చిత్ర‌బృందం రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేసింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: