విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందని గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టును వెంకీ కన్ఫామ్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావచ్చు అని అంటున్నారు.


వెంకీ ఇమేజ్ కు సెట్ అయ్యే విధంగా త్రివిక్రమ్ కథను రాసుకున్నారట. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న  ఈ సినిమాకు `వెంకట రమణ` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. హీరోయిన్ గా చెన్నై బ్యూటీ త్రిషను ఎంపిక చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉండబోతుందట.
ఆ పాత్రకు టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను త్రివిక్రమ్ ఎంపిక చేసినట్టు సమాచారం అందుతోంది. నిధి అగర్వాల్ చేతిలో ఇప్పుడు రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడిగా చేసిన `హరిహర వీరమల్లు` చిత్రం జూలై 24న‌ రిలీజ్ కాబోతోంది. అలాగే మరోవైపు ప్రభాస్ సరసన `ది రాజా సాబ్` మూవీ చేస్తోంది. ఇది ఈ ఏడాది డిసెంబర్ 5న విడుద‌ల అయ్యేందుకు రెడీ అవుతోంది. అయితే తాజాగా త్రివిక్రమ్, వెంకటేష్‌ సినిమాలో కూడా నిధి అవకాశం తగ్గించుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో త్రివిక్ర‌మ్ సెల‌క్ష‌న్ కేకని.. నిధి త్రిషను డామినేట్ చేయ‌డం ఖాయ‌మ‌ని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: