యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా వార్ 2 సినిమాకు సంబంధించిన సూపర్ సాలిడ్ అప్డేట్ ను ప్రకటించాడు. తాజాగా తారక్ "వార్ 2" మూవీ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు అయన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. అలాగే ఆ పోస్టులో భాగంగా హృతిక్ రోషన్ సార్ కోసం సెట్స్ లో ఉన్నంత సేపు ఎంతో సరదాగా , సంతోషంగా ఉండేది. ఆయన ఎనర్జీకి ఎంతో ఆకర్షితుడని అయ్యాను. ఆయన నుంచి అనేక విషయాలను నేను నేర్చుకున్నాను. ఈ సినిమా ద్వారా దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రేక్షకులకు అదిరిపోయే రేంజ్ సూపర్ సర్ప్రైజ్ ను సిద్ధం చేశాడు. మీకు ఈ సినిమా కొత్త అనుభూతిని పంచుతుంది.

మూవీ విడుదల తేదీ అయినటువంటి ఆగస్టు 14 వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని తారక్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. తాజాగా తారక్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. కొంత కాలం క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ టీజర్ ద్వారా ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తారక్ కెరిర్ లో మొట్ట మొదటి స్టేట్ హిందీ సినిమా. దానితో ఈ మూవీ పై తారక్ అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.

మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తారక్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రస్తుతం స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ కి డ్రాగన్ అనే టైటిల్  ను అనుకుంటునట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై కూడా భారీ అంచనాలు జనాల్లో నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: