శ్రద్ధా శ్రీనాథ్.. సౌత్ సినీ ప్రియలకు ఈ బ్యూటీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లాయర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ వయ్యారి.. ఆ తర్వాతి కాలంలో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. `కోహినూర్` అనే మలయాళ చిత్రంతో 2015లో శ్రద్ధా ప్రేక్షకులకు పరిచయం అయింది. 2016 లో వచ్చిన కన్నడ ఫిల్మ్ `యూ టర్న్` తో శ్రద్ధ శ్రీనాథ్ కు మంచి గుర్తింపు దక్కింది.
ఆ తర్వాత కన్నడ తో పాటు మిగతా సౌత్ భాషల నుంచి కూడా శ్రద్ధకు ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ తొలి చిత్రం `జెర్సీ`. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా.. 2019లో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దాంతో టాలీవుడ్ లోనూ శ్రద్ధా శ్రీనాథ్ బిజీ గా మారింది. రీసెంట్‌గా నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `డాకు మహారాజ్‌` చిత్రంలో శ్రద్ధా ఒక ముఖ్యమైన పాత్రలో అలరించింది.
ప్రస్తుతం తమిళంలో `ఆర్యన్` అనే సినిమాలో యాక్ట్‌ చేస్తుంది. అలాగే కిషోర్ తో క‌లిసి ఆమె యాక్ట్ చేసిన సైన్స్ ఫిక్ష‌న్ మూవీ `క‌లియుగం` జూలై 11న ఓటీటీలో విడుద‌ల కాబోతుంది. 2064 లో ప్రపంచం ఎలా ఉండబోతుంది అనే ఐడియాతో డైరెక్టర్ ప్రమోద్ సుందర్ తెర‌కెక్కించిన ఈ మూవీ మేలో థియేట‌ర్స్ లో రిలీజ్ కాగా.. ఇప్పుడు ఓటీటీలో సంద‌డి చేయ‌బోతుంది.
ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ను పంచుకుంది. ఎప్పుడూ హాట్ హాట్ గా క‌నిపించే శ్ర‌ద్ధా.. ఈసారి తెల్లచీర అందుకు తగ్గట్లే ఆభరణాలు ధ‌రించి  ట్రెడిషనల్ గా ముస్తాబైంది. టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో మల్లెపూలు ప‌రిచిన నేల‌పై కూర్చుని క్యూట్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది. ఓర చూపులు చూస్తూ కురాళ్ల మ‌తి పోగొట్టింది. ఆమె తాజా అందాలు చూసి నెటిజ‌న్లు అదరహో అనికుండా ఉండ‌లేక‌పోతున్నారు. శ్రద్ధ శ్రీనాథ్ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: