విశ్వంభర సినిమాకి సంబంధించి ఒకే ఒక ఐటెం సాంగ్ బ్యాలెన్స్ ఉంది, అందులో మౌని రాయ్‌ని తీసుకున్నట్లు సమాచారం వచ్చినప్పటికీ, యూనిట్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కీరవాణి స్థానంలో భీమ్స్ సిసిరోలీయో ఈ పాటను స్వరపరిచేందుకు ఎంపికయ్యారని తెలుస్తోంది. అయితే, ఫ్రెష్ ట్యూన్‌కి బదులు, మెగాస్టార్ చిరంజీవి ఐకానిక్ సాంగ్స్‌లో ఒకటైన ‘ఆట కావాలా పాట కావాలా’ (అన్నయ్య సినిమా నుంచి) రీమిక్స్ చేస్తున్నారని సమాచారం. చిరంజీవి గతంలో తన పాత పాటలను తన సినిమాల్లో రీమిక్స్ చేయడానికి దూరంగా ఉండటం గమనార్హం. రామ్ చరణ్ మాత్రం ‘నాయక్’లో ‘గ్యాంగ్ లీడర్’, ‘రచ్చ’లో ‘కొండవీటి దొంగ’ పాటలు రీమిక్స్ అయినప్పటికీ, చిరు ఈ ప్రయోగాన్ని ఇప్పటివరకూ దూరంగా ఉంటూ వచ్చారు.

ఇక ఈ రీమిక్‌ నిర్ణయంలో రిస్క్ లేకపోలేదు. ‘ఆట కావాలా’ పాట 2000లో విడుదలైన ‘అన్నయ్య’ సినిమాలోది. అంటే, 25 ఏళ్ల క్రితం వచ్చిన ఈ పాటలో చిరంజీవి, సిమ్రాన్‌ల ఊరమాస్ స్టెప్పులు థియేటర్లను ఊపేశాయి. ఈ పాట ఇప్పటికీ టీవీ ఛానళ్లలో, యూట్యూబ్‌లో చూస్తే కళ్లు తిప్పుకోవడం కష్టం. ‘అన్నయ్య’ విజయంలో ఈ పాట పాత్ర కీలకం. చిరంజీవి క్రేజ్‌, సిమ్రాన్ గ్లామర్ ఈ పాటను అమరత్వం చేశాయి. ఇప్పుడు ఆ మ్యాజిక్‌ని మళ్లీ సృష్టించాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే, సోషల్ మీడియాలో పాత, కొత్త వెర్షన్ల పోలికలతో నెటిజన్లు విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. విశ్వంభర సినిమా ఇప్పటికే తగినంత బజ్ లేక సవాళ్లను ఎదుర్కొంటోంది. గత ఏడాది ఆగస్టులో టీజర్ విడుదలైన తర్వాత, ఎలాంటి కొత్త వీడియో కంటెంట్ రిలీజ్ కాలేదు.

సంక్రాంతి రిలీజ్ అనుకున్నా, ఏడు నెలలు దాటినా కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు. అదే సమయంలో, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగా 157 శరవేగంగా పూర్తవుతోంది. ఇలాంటి నెగటివ్ వాతావరణంలో, ‘ఆట కావాలా’ రీమిక్స్‌ని ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టు తెరకెక్కించడం దర్శకుడు వశిష్టకు పెద్ద సవాల్. మణిశర్మ ఒరిజినల్ మాస్ కంపోజిషన్‌కి భీమ్స్ ఎంతవరకు న్యాయం చేస్తాడనేది చూడాలి. కొత్త ట్యూన్‌కి సమయం లేకపోవడంతోనే ఈ రీమిక్స్‌కి ఓటేశారని ఇన్‌సైడ్ టాక్. కొత్త స్టైల్‌లో మార్పు: ఈ రీమిక్స్‌లో భీమ్స్ ఒరిజినల్ ఎనర్జీని ఉంచుతూ, మోడరన్ బీట్స్, ఎలక్ట్రానిక్ టచ్ జోడించి యూత్‌ని ఆకర్షించే అవకాశం ఉంది. మౌని రాయ్ గ్లామర్, చిరంజీవి స్టైల్ కలిస్తే, ఈ పాట కొత్త తరం ఆడియన్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్‌ని కూడా అలరించవచ్చు. అయితే, ఒరిజినల్ మ్యాజిక్‌ని రీక్రియేట్ చేయడం, అదే సమయంలో కొత్త స్టైల్ ఇవ్వడం భీమ్స్, వశిష్టలకు కత్తిమీద సాములాంటి పని.

మరింత సమాచారం తెలుసుకోండి: