బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో కంగనా రనౌత్ ఒకరు. వేర్వేరు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా కంగనా రనౌత్ వార్తల్లో నిలిచారు. దేవుడు నన్ను ప్రధానిని చేయడు అంటూ కంగనా రనౌత్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నేను రాజకీయ జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నానని ఈ రంగం చాలా భిన్నమైనదని కంగనా తెలిపారు.

ఇది నా నేపథ్యం కాదని  నేను మహిళల హక్కుల కోసం  పోరాడానని  ప్రజలు నా దృష్టికి  తీసుకొస్తున్న  సమస్యలు చూసి ఆశ్చర్యం కలిగిందని  నేను ఎంపీని అయినప్పటికీ  నా దగ్గరకు పంచాయితీ స్థాయి సమస్యలు తీసుకొస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.  రోడ్లు బాలేవని వాళ్ళు చెబుతున్నారని  అది రాష్ట్ర ప్రభుత్వం స్థాయిదని నేను చెప్పినా  వారు అర్థం  చేసుకోరని  మీ సొంత  డబ్బును  ఉపయోగించి  సమస్యను పరిష్కరించండి అని  అంటారని కంగనా చెప్పుకొచ్చారు.

నేను భారత  ప్రధాని పదవికి  సమర్ధురాలినని నేను అనుకోవడం లేదని  ఆ కోరిక కూడా నాకు లేదని దేవుడు నన్ను ప్రధానిని  చేయడని సామాజిక  సేవ నా నేపథ్యం   కాదని  పూర్తిగా  ప్రజా సేవకు  అంకితమయ్యే  మనసత్త్వం  నాది కాదని  నాకు  లగ్జరీ  సదుపాయాలను  అనుభవించాలని స్వార్థం కూడా ఉందని  నేను జీవించిన జీవితం  అలాంటిదని  దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో  ఈ రంగంలోకి పంపాడో  నాకు తెలియదని  ఆమె అన్నారు.

గత కొంతకాలంగా  కంగనా రనౌత్  తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.  హిమాచల్ ప్రదేశ్ లోని వరద ప్రభావిత ప్రాంతాలను  కంగనా రనౌత్  పరిశీలించారు.  అక్కడి ప్రజలకు సహాయం చేయడానికి  తానూ కేంద్ర మంత్రిని కానని  విపత్తు నిర్వహణ నిధులు అందించడానికి తన  దగ్గర డబ్బులు లేవని ఆమె  చేసిన కామెంట్లు  సంచలనం అవుతున్నాయి. కంగనా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: