"హరిహర వీరమల్లు".. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్ రోల్ లో ఈ సినిమాలో ఉండబోతున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలిచిపోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ సినిమా జూలై 24వ తేదీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను చకచక పూర్తి చేసేసుకున్నారు మూవీ  మేకర్స్.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో చేయడానికి ముందుగా ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. మొదటి నుంచి మేకర్స్ తిరుపతి వేదికగా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా అంగరంగ వైభవంగా భారీగా జరపాలి అంటూ వెయిట్ చేశారు . కానీ ఇప్పుడు ప్రీ రిలీజ్ వేదికను మార్చేసినట్లు తెలుస్తుంది . తిరుపతి నుంచి విశాఖపట్నం కి ప్రీ రిలీజ్ వేదికను మార్చినట్లు లేటెస్ట్ గా సమాచారం అందుతుంది . దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు .

ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు . అలాగే ఏఎం రత్నం నిర్మాణం వహించిన ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటించింది . ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా అప్డేట్స్ హరిహర వీరవల్లి మూవీ పై హ్యూచ్ అంచనాలు పెంచేసాయి. ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..? జులై 24వ తేదీ హరిహర వీరమల్లు రిజల్ట్ తెలిసిపోతుంది.ఈ సినిమాలో పవన్ కల్యాణ్ రాబిన్‌హుడ్ తరహాలో, మొఘలుల కాలం నాటి వీరుడిగా కనిపించనున్నారు. ధనికుల దగ్గర దోచుకుని పేదలకు పంచే పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. అత్యాధునిక గ్రాఫిక్స్‌, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, చారిత్రక సెట్స్‌తో ఈ చిత్రం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందింది.


మరింత సమాచారం తెలుసుకోండి: