చాలామంది నటీనటులు కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా ఉంటారు.. అలా ఒక సినిమాతో హిట్ అయిన నటీనటులు ఎన్నో యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తారు.ఎన్నో వ్యాపార ప్రకటనల్లో నటించి కోట్లు సంపాదించిన నటినటులు ఎంతో మంది ఉన్నారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం వ్యాపార ప్రకటనల్లో నటించడానికి ఒప్పుకోరు. కొంతమంది మాత్రం యాడ్స్ విరివిగా చేస్తూ ఉంటారు. అయితే అన్ని యాడ్స్ ఒకెత్తయితే కండోమ్ యాడ్ లో చేయడం మరో ఎత్తు.ఎందుకంటే చాలామంది సెలెబ్రేటీలు అందానికి సంబంధించిన ఎలాంటి ప్రోడక్ట్ల గురించి అయినా ప్రమోట్ చేస్తారు. కానీ ఇలాంటి కండోమ్ యాడ్ లో చేయమంటే మాత్రం కాస్త వెనకడుగు వేస్తారు. కానీ తాజాగా ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఈ యాడ్ లో చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. 

ఇక మనం భారతదేశంలో మ్యాన్ ఫోర్స్ అనే కండోమ్ కంపెనీ ప్రముఖ బ్రాండ్ అనే సంగతి మనకు తెలిసిందే. ఈ మ్యాన్ ఫోర్స్ కంపెనీని డాక్టర్ కే.ఎస్.రెడ్డి స్థాపించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఇండియాలో ప్రముఖమైన మ్యాన్ ఫోర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకుంటున్నట్టు బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే జాన్వీ కపూర్.. ఇక ఈ హీరోయిన్ పేరు వినగానే చాలామంది ఆశ్చర్యానికి గురవుతారు. కానీ ఇది నిజమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఎందుకంటే ఈ కండోమ్ యాడ్ లో నటించడం చాలా సాహసోపేతమైన చర్య అనుకోవచ్చు.. సినీనటీమణులు ఫ్యాషన్, కాస్మెటిక్స్ వంటి ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా చేస్తారు.

కానీ ఇలాంటి కండోమ్ యాడ్లకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమంటే అస్సలు ఒప్పుకోరు చాలామంది వెనకడుగు వేస్తారు. కాని జాన్వీ కపూర్ మాత్రం కండోమ్ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే మన భారతదేశంలో మ్యాన్ ఫోర్స్ కంపెనీకి మంచి ఆదరణ ఉంది. అయితే ఇలాంటి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా జాన్వీ కపూర్ ని పెట్టుకుంటే ఇది ప్రజల్లోకి మరింత లోతుగా వెళుతుంది అని ఆలోచన చేసినట్టు సమాచారం.  కండోమ్ అమ్మే కంపెనీలు యువతను దృష్టిలో పెట్టుకొని వారి ప్రోడక్ట్లని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు.
అయితే జాన్వి కపూర్ కి యూత్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో చెప్పనక్కర్లేదు.అలాంటి యూత్ క్రష్ అయినటువంటి జాన్వీ కపూర్ ని ఈ యాడ్లో తీసుకొని సూపర్ సక్సెస్ అవ్వాలని మ్యాన్ ఫోర్స్ కంపెనీ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మ్యాన్ ఫోర్స్ బ్రాండ్ కండోమ్ యాడ్లో జాన్వీ కపూర్ చేస్తుంది అనే సంగతి బయటపడడంతో చాలామంది నెటిజన్లు జాన్వీ కపూర్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ కి బాయ్ ఫ్రెండ్ తో ఆ విషయంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా.. అందుకే అలాంటి యాడ్ చేయడానికి కూడా ఒప్పుకుంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: