టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో అన్షు అంబానీ ఒకరు. ఈమె టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కే విజయ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మన్మధుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈమె పాత్ర నిడివి తక్కువే ఆయనప్పటికీ ఈ సినిమాలో ఈమె పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండడం , అందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం , ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈమె ప్రభాస్ హీరోగా రూపొందిన రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈమె సినిమాలకు దూరం అయింది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈమె తాజాగా సందీప్ కిషన్ హీరోగా త్రినాథ్ రావు  నక్కిన దర్శకత్వంలో రూపొందిన మజాకా సినిమాతో తిరిగి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో రీతు వర్మ హీరోయిన్ గా నటించగా ... రావు రమేష్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి లభించింది. ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాల్లో నటించిన ఈ నటి ఎక్కువ శాతం సినిమాల్లో స్కిన్ షో చేయలేదు. 

ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో ఈమె ఏకంగా బికినీ వేసుకొని అదిరిపోయే హాట్ లుక్ లో ఉంది. దానితో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే మజాకా మూవీ తో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తుందా ..? లేక మళ్ళీ గ్యాప్ తీసుకుంటుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: