త్రిష - జ్యోతిక ఇద్దరికీ ఇద్దరే. ఏ ఒక్కరిని తీసి పడేయాలేము. ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్స్. ఇద్దరు కూడా ఇండస్ట్రీలో స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు . ప్రజెంట్ ఇద్దరు కూడా తమ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి జెడ్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్తున్నారు . జ్యోతిక ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎంత మంది బడా హీరోలతో నటించి.. ఎన్ని సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నింది అనేది అందరికీ తెలుసు . త్రిష కూడా అంతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది . అందరితో నటించి హిట్స్ తన ఖాతాలో వేసుకున్నింది.


ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వీళ్ల ఇద్దరికి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది.  జ్యోతిక - త్రిష ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నారట . ఆ సినిమా మన తెలుగు హీరో తోనే నటించబోతూ ఉండటం ఇంకా ఇంకా స్పెషల్ . ఆ సినిమా మరింటో కాదు విశ్వంభర. వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది . ఇది అందరికీ తెలుసు . అయితే ఈ సినిమాలో జ్యోతిక కూడా కనిపించబోతుంది అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది .



ఒక స్పెషల్ క్యారెక్టర్ లో జ్యోతిక కొన్ని నిమిషాల పాటు అలా మెరవబోతుందట . ఈ సినిమా కథను మలుపు తిప్పే పాత్రలో జ్యోతిక నటించబోతుంది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. జ్యోతిక - చిరంజీవి ..ఠాగూర్ అనే సినిమా లో నటించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.  ఆ తర్వాత వీళ్ళు కలిసిన నటించలేకపోయారు. మళ్ళీ ఇన్నాళ్లకు వీళ్ళ కాంబో సెట్ అవ్వడం తో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది . నిజానికి ఏ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి . కానీ వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుంది అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు..!!!

మరింత సమాచారం తెలుసుకోండి: