బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటీమణులలో జాన్వి కపూర్ ఒకరు. హిందీ సినీ పరిశ్రమలో కెరియర్ను మొదలు పెట్టి అక్కడ అద్భుతమైన స్థాయికి చేరుకున్న తర్వాత ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమపై ఇంట్రెస్ట్ చూపడం మొదలు పెట్టింది. అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈమె , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ "పెద్ది" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తూ ఉండగా ... జాన్వి కపూర్మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. శివ రాజ్ కుమార్ , జగపతి బాబు , దివ్యాందు  ఈ మూవీ లో కీలకమైన పాత్రలలో కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం జాన్వి కపూర్ భారీ ఎత్తున పారితోషకం అందుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... పెద్ది సినిమా కోసం జాన్వి కపూర్ ఏకంగా 6 కోట్ల పారితోషకాన్ని అందుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇదే వార్త కనుక నిజం అయితే పెద్ది సినిమా కోసం జాన్వీ కపూర్ అదిరిపోయి రేంజ్ లో పారితోషకం అందుకున్నట్లే అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతానికి పెద్ది సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలబడి ఉన్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే తెలుగు లో జాన్వి కపూర్ క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Jk