మాస్ మహారాజా రవితేజ ఇంట ఇటీవల తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. చిరంజీవితో సహా పలువురు సినీ ప్రముఖులు రాజగోపాల్ రాజకు నివాళులు అర్పించారు. అయితే తండ్రి చనిపోయి అంత్యక్రియలు పూర్తి అయిన రెండు రోజులకే రవితేజ తన రాబోయే సినిమా షూటింగ్‌లో పాల్గొనడంతో అందరూ షాక్ అయిపోతున్నారు.


ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో `ఆర్టీ76` వర్కింగ్ టైటిల్ తో రవితేజమూవీ చేస్తున్నాడు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. 2026 సంక్రాంతి టార్గెట్ గా మేక‌ర్స్ హైద‌రాబాద్ లో వేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. రీసెంట్‌గానే కొత్త షెడ్యూల్ ప్రారంభ‌మైంది. సినిమాలోని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.


అయితే ఇంత‌లో ర‌వితేజ తండ్రి మ‌ర‌ణించాడు. దాంతో రెండు రోజుల పాటు ఇంటికే ప‌రిమితం అయిన ఆయ‌న‌.. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మళ్లీ షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు. తాను ఆల‌స్యం చేసే కొద్ది నిర్మాతకు నష్టం చేకూరుతుందని భావించే ర‌వితేజ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. ఈ ప‌రిణామంతో సినిమాల ప‌ట్ల‌ ర‌వితేజ‌కు ఉన్న డెడికేషన్ ఏంటో స్ప‌ష్ట‌మైంది. కాగా, వ‌చ్చే నెల‌లో ర‌వితేజ `మాస్ జాతర` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. నూత‌న డైరెక్ట‌ర్ భాను భోగ‌వ‌ర‌పు తెర‌కెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: