బెట్టింగ్ యాప్ ల ద్వారా అడ్డదారిలో ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు అని కొంతమంది అమాయకపు ప్రజలను మోసం చేసి  ప్రకటనలు ఇస్తున్నారు..ఇదే తరుణంలో ఆ ప్రకటనలు చాలామంది అమాయకులు ముఖ్యంగా యువకులు, ఈ బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా డబ్బులు చెల్లించి చివరికి ఆస్తులకు ఆస్తులు పోగొట్టుకొని అప్పులపాలై  ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ ల ద్వారా వందలాదిమంది యువకులే చనిపోయారు. ఇంతగా యువకులు అట్రాక్ట్ అవ్వడానికి ప్రధాన కారకులు సెలబ్రెటీలు అని చెప్పవచ్చు. 

బెట్టింగ్ యాప్ లకు వీరు సపోర్ట్ చేస్తూ ఈ యాప్ ల ద్వారా బాగా డబ్బు సంపాదించవచ్చని వీళ్ళు ప్రకటనలు ఇవ్వడం ద్వారానే ప్రజలు నమ్ముతున్నారు. చివరికి ఆ యాప్ లో డబ్బు పెట్టి మోసపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై దృష్టి సారించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్ లను పూర్తిగా బ్యాన్ చేయాలని వాటిని ప్రమోట్ చేసిన వారిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్ ల ప్రమోటర్స్ పై అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. అయితే తాజాగా బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేసిన సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, స్టార్ హీరో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, నటి మంచు లక్ష్మి  వంటి వారికి ఈడీ  నోటీసులు జారీ చేశారు. 

ఇందులో రానా దగ్గుబాటి జూలై 23న హాజరుకావాలని, అలాగే ప్రకాష్ రాజ్ జూలై 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వార్త మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీంతో చాలామంది నెటిజన్లు ఇలా అమాయకపు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న సెలబ్రిటీలను జైల్లో వేసి చిప్పకూడు తినిపిస్తే ఇంకోసారి ఇలాంటి యాప్ లు ప్రమోట్ చేయరు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: