పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం త్వరలోనే రిలీజ్ సిద్ధమైంది.. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ అభిమానులంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి  టికెట్ రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.  దీంతో ఇది కాస్త విమర్శలకు దారితీసింది.. అయితే పుష్ప2 సినిమా సమయంలో  తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై సీరియస్ గా స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఇకనుంచి ఎవరికి కూడా స్పెషల్ ఉండవని తెలియజేశాడు. అంతేకాదు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలకు గాని అసలు అనుమతి ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు..

ఇది చెప్పి కొన్ని నెలలు కూడా గడవకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చారని సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. హరిహర వీరమల్లు టికెట్ ధరల పెంపుకు  అనుమతి వచ్చిందని సినిమా నిర్మాత ఏఎన్ రత్నం  స్వయంగా ప్రకటించారు. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడైన రోహిన్ రెడ్డి ద్వారానే ప్రీమియర్ షోష్, టికెట్ ధరల పెంపుకు అనుమతి వచ్చిందని ఆయన తెలియజేశారు.. ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి రేవంత్ రెడ్డిపై విమర్శలు ఊపందుకున్నాయి. ఆయన అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పాడని నిరూపణ అయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

టికెట్ ధరల పెంపు ఉండదని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఇంతలోనే  హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ ధరలు పెంచడం దారుణం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా నేషనల్ మీడియా కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఎన్డీఏ కు సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాలకు సపోర్ట్ చేయడం ఏంటంటూ మాట్లాడుతున్నారు. మరి దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: