పవన్ కళ్యాణ్  ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇంతటి ఘనత సాధించడానికి ప్రధాన కారణం సినిమాలే అని చెప్పవచ్చు. సినిమాలను నమ్ముకొని ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాలు కష్టపడ్డారు. ఆ తర్వాత 2024 ఎలక్షన్స్ లో టిడిపి, బీజేపీతో పొత్తు పెట్టుకొని అద్భుతమైన రిజల్ట్ సాధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అలాంటి పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత హీరోగా రాబోతున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ చిత్ర షూటింగ్  ప్రారంభమై కొన్ని సంవత్సరాలు అవుతోంది. 

కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం కారణంగా షూటింగ్ కు రాలేదు. ఈ మధ్యకాలంలో తాను టైం తీసుకొని మరీ షూటింగ్స్ పూర్తి చేసి సినిమా కంప్లీట్ చేసేసారు. అలాంటి ఈ చిత్రం మరికొన్ని గంటల్లో రిలీజ్ అవుతుంది. ఇదే తరుణంలో హరిహర వీరమల్లు సినిమా హిట్ కావాలని ఆయన అభిమానులు ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని చాటుకున్నారు.  ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కృష్ణా జిల్లాలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అభిమానులు. ఈ పూజలను నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు, చిరంజీవి అభిమానులు కలిసి చేశారు.

అంతేకాకుండా విశాఖపట్నంలో కూడా జన సైనికులు వినాయకుడికి 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమా జూలై 24వ తేదీన తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో  రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీనికోసం అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఈరోజు రాత్రికి యూఎస్ లో ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన పనికి చాలామంది నెటిజెన్లు ఫ్యాన్స్ అంటే ఇలా ఉండాలి అంటూ మెచ్చుకుంటున్నారు.మరి చూడాలి ఈ చిత్రం ఎలాంటి హిట్ కొడుతుంది అనేది మరికొన్ని గంటల్లో తేలబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: