హమ్మయ్య.. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన "హరిహర వీరమల్లు" సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది . భారీ అంచనాల నడుమ అంతకంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్స్ లో సందడి చేస్తుంది ఈ సినిమా. మూవీ చేసిన ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్ ని తెగ పొగిడేస్తున్నారు . ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పవన్  నటనా  పర్ఫామెన్స్ మాత్రం హైలెట్ గా ఉంది అంటూ తెగ ప్రశంసలు కురిపించేస్తున్నారు . చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా థియేటర్స్ రిలీజ్ అవుతూ ఉండడంతో జనాలు ఈ సినిమాని చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .


కాగా కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్స్ లో అభిమానులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది . మరీ ముఖ్యంగా ప్రీమియర్స్ తోనే ఊహించని నెంబర్స్ అందుకొని భారీ రికార్డ్ సెట్ చేసింది హరిహర వీరమల్లు . కాగా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటూ సినీ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు . వరల్డ్ వైడ్ గా హరిహర వీరమల్లు  సినిమా మొదటి రోజు అందుకునే వసూళ్ళ ప్రిడిక్షన్ ఎంత అయి ఉంటుంది ..?? అంటూ చర్చించుకుంటున్నారు .



అందుతున్న సమాచారం ప్రకారం .. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ "హరిహర వీరమల్లు" సినిమా ప్రీమియర్స్ తో కలిపి "తెలుగు రాష్ట్రాలలో" పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ అంచనా వేస్తే ఈజీగా 100 కోట్ల గ్రాస్ అందుకుంటుంది అంటున్నారు. సినిమా కి  వచ్చిన భారీ హైక్.. అలాగే మేజర్ గా తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ ప్రభావం దీనిపై ఎక్కువగా చూపింది . ఓవర్సీస్ లో కొంచెం అటూ ఇటూ అనిపించినా కానీ పవన్  స్టామినాకి ఏమాత్రం తగ్గకుండా వీరమల్లు భారీ ఓపెనింగ్స్ ని సాధించే ఛాన్స్ ఉంది. అదే నిజమైతే మాత్రం బాహుబలి , ఆర్ఆర్ఆర్ , పుష్ప సినిమాలను తుక్కుతుక్కు చేసినట్లే ఈ హరిహర వీరమల్లు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..?? మరికొద్ది గంటల్లోనే హరిహర వీరమల్లు మొదటి రోజు కలెక్షన్స్ బయటకు వచ్చేస్తాయి. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే..!!?

మరింత సమాచారం తెలుసుకోండి: