- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కూలీ'కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ రోజు మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఎంతగానో ఎదురుచూస్తున్న కూలీ ట్రైలర్ ఆగస్ట్ 2న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర.. స్టార్స్ అందరూ పవర్ ఫుల్ లుక్స్ లో కనిపించిన ట్రైలర్ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ అదిరిపోయింది .


డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.  ఈ చిత్రంలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ సినిమాపై భారీ క్రేజ్‌ను నెలకొల్పాయి. ‘చికిటు’, మోనికా సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.  


కలానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాప్  టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. ఆనిరుధ్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్. ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కానుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: