టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన డైరెక్టర్లలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన చాలా కాలం క్రితమే డైరెక్టర్గా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈయన దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించిన తర్వాత అనేక సంవత్సరాల పాటు అద్భుతమైన విజయాలను అందుకుంటూ వచ్చాడు. దానితో ఈయన చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం పూరి జగన్నాథ్ సరైన విజయాలను అందుకోవడంలో చాలా వెనుకబడిపోయాడు. ఈయన ఆఖరుగా దర్శకత్వం వహించిన లైగర్ , డబల్ ఈస్మార్ట్ మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్లను అందుకున్నాయి.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ తమిళ నటుడు అయినటువంటి విజయ్ సేతుపతి తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా , టబుఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ కి మహతి స్వర సాగర్ సంగీతం అందించబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. తాజాగా విజయ్ సేతుపతి "సార్ మేడమ్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నిత్యా మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా విజయ్ సేతుపతి , పూరి జగన్నాథ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ ... కొన్ని రోజుల క్రితం పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను స్టార్ట్ చేశాం.

సినిమా అద్భుతంగా వస్తుంది. పూరి జగన్నాథ్ ఒక అద్భుతమైన దర్శకుడు. సినిమాను సూపర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఆయన డైలాగ్స్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా ఉండబోతున్నాయి అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు. ఇలా విజయ సేతుపతి , పూరి జగన్నాథ్ మూవీ గురించి పాజిటివ్ గా మాట్లాడడంతో ఈ మూవీ తో పూరి జగన్నాథ్ మంచి విజయాన్ని అందుకొని తిరిగి కం బ్యాక్ అవుతాడు అని చాలా మంది భావిస్తున్నారు. ఈ మూవీ కనుక మంచి విజయం సాధిస్తే విజయ్ సేతుపతి కి తెలుగులో మంచి క్రేజ్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs