దాదాపు ఏ ఇండస్ట్రీలో అయినా కూడా స్టేట్ మూవీ విడుదల అయినప్పుడు డబ్బింగ్ సినిమాలకు పెద్ద ఎత్తున థియేటర్లు దొరకడం కష్టం అవుతుంది. అందుకు ప్రధాన కారణం ఆ ప్రాంత హీరో నటించిన సినిమాలను ప్రేక్షకులు పెద్ద ఎత్తున చూస్తూ ఉంటారు. దానితో వారికే ఎక్కువ సినిమా ధియేటర్లను కేటాయిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో మాత్రమే స్టేట్ మూవీలు విడుదల అయినా కూడా డబ్బింగ్ సినిమాలకు పెద్ద ఎత్తున థియేటర్లు దక్కుతూ ఉంటాయి. తమిళ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో విడుదల అయ్యి మంచి విజయాలను సాధించాయి. అలాగే ఈయన కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించాడు.

తాజాగా ఈయన సార్ మేడమ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఆగస్టు ఒకటవ తేదీన తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించిన తర్వాత హరిహర వీరమల్లు జూలై 24 వ తేదీన విడుదల కానుంది. అలాగే కింగ్డమ్ సినిమా జులై 31 వ తేదీన విడుదల కానుంది. ఈ రెండు సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కే పెద్ద ఎత్తున థియేటర్లను కేటాయిస్తారు. దానితో సార్ మేడమ్ మూవీ కి పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరకడం కష్టం అని చాలా మంది భావించారు. 

కానీ మంచి క్రేజ్ ఉన్న ఇద్దరు తెలుగు హీరోలు నటించిన సినిమా విడుదల అయినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్ మేడమ్ మూవీ కి భారీ ఎత్తున థియేటర్లు దొరికాయి. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 250 ప్లస్ స్క్రీన్ లలో విడుదల కానున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదల కాబోతుంది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని నిత్యా మీనన్ హీరోయిన్గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs