తెలుగు సినీ కార్మికుల వేతనాలను 30 శాతం పెంచాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేయడంతో సినీ కార్మికులు సమ్మెకు దిగారు. అయితే, యూనియన్ డిమాండ్‌ను ఫిల్మ్ ఛాంబర్ తోసిపుచ్చింది. ఈ వివాదంపై చర్చించేందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు, నిర్మాత మండలి ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఈ చర్చల అనంతరం నిర్మాత మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఫిల్మ్ ఛాంబర్‌తోనే 'మా' కలిసి పనిచేస్తుందని మంచు విష్ణు స్పష్టం చేశారని తెలిపారు. పేద సినీ కార్మికులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు. లేబర్ యాక్ట్ ప్రకారం నిర్మాతలకు కార్మికుల వేతనాలు భారీ భారం అవుతున్నాయని, ఐటీ ఉద్యోగుల కంటే యూనియన్ కార్మికుల జీతాలు ఎక్కువగా ఉన్నాయని ప్రసన్న కుమార్ తెలిపారు.

యూనియన్‌లో సభ్యత్వం పొందాలంటే ఏడెనిమిది లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు. యూనియన్ తమ కార్మికులతోనే పని చేయాలనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలను కూడా ధిక్కరించి సమ్మెకు పిలుపునిచ్చారని, ఫెడరేషన్ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని ప్రసన్న కుమార్ విమర్శించారు.

నిర్మాతల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగోలేదని, ఇలాంటి సమయంలో సమ్మె చేయడం సరికాదని ఆయన అన్నారు. కార్మికులు తమతో కలిసి వస్తారని ఆశిస్తున్నామని, స్వార్థపూరిత విధానాలు కాకుండా అందరూ ఒక కుటుంబంలా కలిసి చర్చించుకోవాలని ఆయన కోరారు. ప్రసన్న కుమార్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు






మరింత సమాచారం తెలుసుకోండి: