
మహేష్ బాబు తో రెండు చిత్రాలు చేసి అందులో దూకుడు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బాద్షా సినిమా మరో విజయాన్ని అందుకుంది. ఆ నమ్మకంతోనే మహేష్ బాబు కు ఆగడు సినిమా కథను చెప్పానని కానీ ఆగడు సినిమా చూసిన వారందరూ కూడా దూకుడుల ఉందంటూ చెప్పారు. నాకు కూడా చాలా సన్నివేశాలలో అసంతృప్తి ఉన్నది.. దూకుడు సినిమా వచ్చిన కొన్ని సంవత్సరాలకే ఆగడు సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ రెండు చిత్రాలను పోల్చుకున్నారంటూ తెలిపారు.
సినిమా కథ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేమో అంటూ తెలిపారు. ఇప్పటికీ ఈ విషయం పైన తాను బాధపడుతున్నానని తెలిపారు శ్రీనువైట్ల. మహేష్ బాబుకు మరో మంచి హిట్ ఇవ్వలేకపోయానని రిగ్రేట్ ఫీలింగ్ అనేది తనలో ఉండిపోయిందని తెలిపారు. మహేష్ బాబు మాత్రం అలాంటివి ఏవి కూడా మనసులో పెట్టుకోరు.ఆ మూవీ తర్వాత కూడా నార్మల్గానే తనతో మాట్లాడారని చాలా మంచి వ్యక్తి మహేష్ బాబు అంటూ తెలిపారు. అవకాశం వస్తే మళ్లీ మహేష్ బాబుతో ఒక బ్లాక్ బాస్టర్ సినిమా తీసి రిగ్రేట్ ఫీలింగ్ పోగొట్టుకోవాలనుందంటూ తెలియజేశారు. కాస్త సమయం తీసుకునైనా సరే మంచి సినిమాలు తీసి మళ్లీ తానేంటో నిరూపించుకుంటానంటూ తెలియజేశారు శ్రీనువైట్ల. తన సినిమాలో కామెడీ సీన్స్ ఖచ్చితంగా ఉంటాయని తెలిపారు.