కన్నడ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంతార అనే మాస్టర్‌పీస్‌తో తనదైన స్టైల్‌లో నటించి, దర్శకత్వం వహించి, దేశవ్యాప్తంగా ఓ హవా క్రియేట్ చేశాడు. ఆ సినిమా విజయంతో ఆయనకి తెలుగు, తమిళం, హిందీతో పాటు దేశవ్యాప్తంగా విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక వైపు నటుడిగా, మరోవైపు దర్శకుడిగా—రెండు వైపులా బలమైన ఇమేజ్ సంపాదించుకున్న రిషబ్ శెట్టి ఇప్పుడు తన కలల ప్రాజెక్ట్ ‘కాంతార చాప్టర్ వన్’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

భారీ అంచనాలు, అంతకంటే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. దసరా కానుకగా రాబోతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో హైప్ ఎక్కడికక్కడ బాగా కనిపిస్తోంది. అయితే, ఈ హైప్ మధ్యలో అనుకోని ట్విస్ట్ వచ్చింది. సాధారణంగా ఏ భారీ సినిమాకైనా ముందు రోజు ప్రీమియర్ షోస్ వేయడం ఆనవాయితీ. అదే రీతిలో, కాంతారా చాప్టర్ వన్ కి కూడా అక్టోబర్ 1వ తేదీ రాత్రి ప్రీమియర్ షోస్ ప్లాన్ చేశారు.


 ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి 10 గంటలకు స్పెషల్ షో కూడా అనౌన్స్ చేశారు.న్కానీ, చివరి నిమిషంలో మేకర్స్ ప్రీమియర్ షోస్ అన్నింటినీ రద్దు చేస్తూ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇందుకు గల కారణం ఏమిటన్న దానిపై స్పష్టత ఇవ్వకపోయినా, టికెట్ల బుకింగ్‌లో తక్కువ ఆక్యుపెన్సీ ఉండడమే కారణమని కొన్ని వార్తలు వెలువడుతున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్స్‌లో అనుకున్నంత హడావుడి కనిపించకపోవడంతో, తక్కువ ఫిల్ అయ్యే థియేటర్లలో ప్రీమియర్ వేయడం కన్నా డైరెక్ట్‌గా అక్టోబర్ 2 ఉదయం నుంచే అన్ని షోలు స్టార్ట్ చేయాలనే నిర్ణయానికి చిత్ర బృందం వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ డెసిషన్ మాత్రం అభిమానులకు పెద్ద నిరాశ కలిగించింది. ఎంతో ఆతృతగా, ఉత్సాహంగా రాత్రి ప్రీమియర్ కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సోషల్ మీడియాలో ఇప్పటికే దీనిపై మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయి.ఏదేమైనా, కాంతారా చాప్టర్ వన్ రద్దయిన ప్రీమియర్స్ వార్త షాక్ ఇచ్చినా, అసలు పరీక్ష మాత్రం అక్టోబర్ 2న మొదలవుతుంది. దసరా కానుకగా విడుదలకానున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరిస్తుందో, రిషబ్ శెట్టి కెరీర్‌లో ఇంకో మలుపు ఎలా తిప్పుతుందో చూడాలి..???


మరింత సమాచారం తెలుసుకోండి: