పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి మూవీ సెప్టెంబర్ 25న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమా హిట్ సెలబ్రేషన్స్ లో ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం మునిగి తేలుతుంది.అంతేకాకుండా రీసెంట్ గానే మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఓజి సినిమా వీక్షించారు.అలాగే ఓజి మూవీకి సంబంధించి సక్సెస్ మీట్ ని కూడా అరేంజ్ చేయబోతున్నారు. ఓ పక్కన ఈ సినిమాకు సంబంధించి బయ్యర్లు నష్టపోయారని వార్తలు వినిపిస్తున్నప్పటికీ మరో పక్క ఓజీ మూవీ బ్లాక్ బస్టర్ వినిపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ సినిమా గురించి ఓ విషయం బయటపడింది. అదేంటంటే..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ టీనేజ్ పాత్రలో అకీరా నందన్ ఎందుకు నటించలేదు.దానికి కారణం.. మరి పవన్ కళ్యాణ్ ఓజి సినిమాలో అకిరా నందన్ కనిపిస్తారని పవన్ టీనేజ్ పాత్రలో అకిరా నందన్ నటిస్తారనే వార్తలు వినిపించాయి.

అంతేకాదు ఓజి మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక కూడా అఖిరా నందన్ ఉన్నాడు సినిమాలో కచ్చితంగా చూడొచ్చు అని చాలామంది పవర్స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు.కానీ తీరా సినిమా చూశాక మాత్రం అందులో అఖీరా నందన్ లేరు. పవన్ కళ్యాణ్ టీనేజ్ పాత్రలో ఆకాష్ శ్రీనివాస్ అనే అబ్బాయి నటించారు. అయితే ఓజి మూవీలో పవన్ కళ్యాణ్ టీనేజ్ పాత్రలో అకీరా నందన్ ఎందుకు నటించలేదు. ఆకాష్ శ్రీనివాస్ ని ఎందుకు తీసుకున్నారనే డౌట్ చాలామంది అభిమానులకి వచ్చింది. అయితే ఇదే డౌట్ ఆకాష్ శ్రీనివాస్ కి కూడా వచ్చిందట.ఈ విషయం గురించి తాజాగా ఆకాష్ స్పందిస్తూ.. ఇలాంటి సందేహం నాలో కూడా కలిగింది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి టీనేజ్ పాత్రలో నన్ను తీసుకున్నారు. అకిరానందాన్ ని ఎందుకు తీసుకోలేదు అని అనుకున్నాను.

 కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కంటే అకిరా నందన్ ఇప్పటికే చాలా పొడవుగా ఉన్నారు. వయసు పెరిగే కొద్దీ పొడవు కూడా పెరుగుతారు. కాబట్టి ఇప్పటికే తండ్రి కంటే హైట్ ఉన్న అఖిరా నందన్ ని ఈ సినిమాలో టీనేజ్ పాత్ర కోసం తీసుకున్నాక మళ్లీ పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చే సీన్లో హైట్ తక్కువ ఉంటే బాగుండదు కదా అందుకే నన్ను తీసుకున్నారు కావచ్చు. అలాగే ఈ సినిమాలో అకీరా నందన్ తో ఓ సన్నివేశం తెరకెక్కించాకే బాలేదని ఆయన్ని పక్కన పెట్టి నన్ను తీసుకున్నారు కావచ్చు అంటూ ఆకాష్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.హైట్ కారణంగానే పవన్ కళ్యాణ్ టీనేజ్ పాత్రలో అకిరా నందాన్ ని తీసుకోలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: