"సూర్య".. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? ఈ పేరు చెప్తుంటే పూనకాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి. పేరుకి  కోలీవుడ్ హీరోనే కానీ తెలుగులో మాత్రం హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . కోలీవుడ్ లో ఎంత మార్కెట్ ఉందో అంతకు డబుల్ రేంజ్ లోనే టాలీవుడ్ లోనూ మార్కెట్ సంపాదించుకున్నాడు హీరో సూర్య.  ప్రెసెంట్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు , గత రెండు సినిమాలు ఆయన నటించినవి బిగ్ ఫ్లాప్స్ అయిపోయాయి.  దీంతో సూర్యకి కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొక తప్పలేదు . ఆయన నటించిన "కంగువా" అదే విధంగా "రెట్రో" సినిమాలు భారీ డిజాస్టర్ టాక్ మూట కట్టుకున్నాయి .


దీంతో వెంకీ అట్లూరితో తెరకెక్కే సినిమా కచ్చితంగా హిట్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది . అయితే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించిన చిత్ర యూనిట్ ..ప్రస్తుతం సరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది . మరి ముఖ్యంగా వచ్చేవారం సూర్య పై ఓ సోలో సాంగ్ చిత్రీకరణకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది అంటూ టాక్ బయటకి వచ్చింది . కాగా ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీ లో ఏకంగా రెండు కోట్లు ఖర్చు చేసి ఒక సెట్ ని కూడా వేయబోతున్నారట . అంతేకాదు ఈ సాంగ్ పూర్తిగా షూట్ కంప్లీట్ అయ్యాక సూర్య పై భారీ యాక్షన్ సీన్స్ లో తెరకెక్కించబోతున్నారట . అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి వెంకీ అట్లూరి చాలా డిఫరెంట్ గా ఉండే టైటిల్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది .



ఈ సినిమాకి "విశ్వనాథన్ అండ్ సన్స్" అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేయాలి అంటూ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట . ఇందులో అందాల ముద్దుగుమ్మ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుంది . జీవి ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తూ ఉండడం గమనార్హం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుంది . అయితే "విశ్వనాథన్ అండ్ సన్స్" అనే టైటిల్ వినగానే అందరికీ త్రివిక్రమ్ - బన్నీ కాంబోలో తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి టైటిల్ గుర్తొచేసింది. ఆ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా టైటిల్ ని అలా అలా మార్చి వెంకీ అట్లూరి తనదైన స్టైల్ లో "విశ్వనాథన్ అండ్ సన్స్" అనే విధంగా మార్చేసాడేమో అంటూ కొంతమంది నాటీగా కౌంటర్స్ వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: