కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ధనుష్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో విజయాలను అందుకుని కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన ఇప్పటికే సార్ , కుబేర అనే రెండు తెలుగు సినిమాలలో కూడా నటించాడు. ఈ రెండు మూవీలతో కూడా మంచి విజయాలను సొంతం చేసుకుని తెలుగు సినీ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటి మనులలో మృనాల్  ఠాకూర్ ఒకరు. ఈమె సీత రామం అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు అద్భుతమైన గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈమె నటించిన హాయ్ నాన్న సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈమె కొంత కాలం క్రితం ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మాత్రం ఈమెకు నిరాశనే మిగిల్చింది. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా ధనుష్ , మృనాల్ డేటింగ్ చేస్తున్నారు అని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

తాజాగా మృనాల్  ఠాకూర్ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ధనుష్ తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఈమె స్పందించింది. తాజాగా మృణాల్ మాట్లాడుతూ  ... ధనుష్ తో నేను డేటింగ్ చేస్తున్నాను అని కొన్ని రూమర్స్ వినిపించాయి. అవి నాకు చాలా ఫన్నీగా అనిపించాయి. ధనుష్ నాకు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్. మేము ఇద్దరం కలిసి కనిపించినంత మాత్రాన మా మధ్యలో ఏదో ఉన్నట్లు అస్సలు కాదు. నేను తాజాగా సన్నాఫ్ సర్దార్ 2 సినిమాలో నటించాను. ఆ మూవీ ఈవెంట్ కు ఆయన రావడానికి కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ మృనాల్ ఠాకూర్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: